హైదరాబాద్: పోలీసు సంస్మరణ దినోత్సవంలో చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలీసుల త్యాగాలను స్మరించుకోవాల్సి న సమయంలో చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైయస్‌ఆర్‌సీపీపై దుర్మార్గంగా మాట్లాడటం దారుణమన్నారు. తుని రైలు ఘటన, అమరావతిలో చెరుకు తోటల దగ్ధం, పోలవరం కాల్వకు గండి కొట్టిన సంఘటనలపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గు చేటు అన్నారు.