గుంటూరు: ప్రభంజనం మొదలైందని, వైయస్ జగన్ పాదయాత్ర జైత్రయాత్రలా సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఎన్నికలకు ఏడాది ముందే ఇలా ఉంటే..ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. ప్రత్తిపాటి పుల్లారావు, చంద్రబాబు వద్ద బస్తాల కొద్ది డబ్బులుఉన్నాయని, వారి వద్ద నుంచి రూ.5 వేల చొప్పున తీసుకొని మీ మనసాక్షి ప్రకారం ఓటు చేయాలని కోరారు. ఏ ఊర్లో చూసినా టీడీపీ నేతలు చేస్తున్న దోపిడీ ఇంతా అంతా కాదన్నారు. దోపిడీ నేతలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారన్నారు. చిలకలూరిపేటలో కథలు చాలా చిత్రంగా ఉన్నాయన్నారు. యుద్ధంలో సత్యభామ సహకరించినట్లు,,ప్రత్తిపాటి పుల్లారావు గెలుపునకు ఆయన భార్య సహకరిస్తుండట అని ఎద్దేవా చేశారు.