విజయవాడ: స్పీకర్ కోడెల శివప్రసాదరావు నాకు రాజకీయ ప్రత్యర్థి అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శాసన సభ అన్నా..సభాపతి అన్నా నాకు గౌరవం ఉందన్నారు. అయితే మా క్యాడర్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించి తప్పుడు కేసులు బనాయిస్తుండటంపై తాను స్పందించాల్సి వస్తుందన్నారు. నన్ను, నా కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంబటి విమర్శించారు.