బతుకుల్లో నిప్పులు పోసి.. హ్యాపీ అమరావతా?

పొగిడించుకొని అంతా బాగుందనుకుంటే ఎలా బాబూ
ఐవైఆర్‌ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పాలి
అమరావతిలో పేదలకు అవకాశం లేకుండా చేశావు
భూములు ఇచ్చిన రైతుల నోట్లో మట్టికొట్టావు
భూములిచ్చిన రైతులకు స్థలం ఎక్కడైనా కేటాయించావా
గ్రీన్‌ జోన్‌ పేరుతో జీఓ ఇచ్చి మరో వ్యాపారం
నీ డ్రామాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు
అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ. 4 వేల కోట్ల ఎలా తగ్గాయి
చంద్రబాబు సమాధానం చెప్పాలి
హైదరాబాద్‌: రైతుల, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగుల బతుకుల్లో నిప్పులు పోసి హ్యాపీ అమరావతి అనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. రైతులు, మహిళలు సంతోషంగా ఉన్నారా.. లేదా.. ఇవన్నీ పట్టించుకోకుండా.. పది మంది విదేశీయులు వచ్చి పొగిడితే.. అంతా ఆనందంగా ఉందని భావించడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అడిగిన ఎవరిదీ రాజధాని.. ఎవరి కోసం రాజధాని అనే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో ఎస్సీ, ఎస్టీలకు స్థానం లేదని శంకుస్థాపన సమయంలోనే అర్థమైందని పార్థసారధి అన్నారు. రాజధాని శంకుస్థాపన అనేది.. చారిత్రాత్మక సంఘటన అన్ని వర్గాలను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. కానీ శిలాఫలకంపై స్థానిక శాసనసభ్యుడి పేరే లేదు. వేదికపై బలహీన వర్గానికి చెందిన సీనియర్‌ మంత్రికి స్థానం కల్పించలేదన్నారు. అంతా సొంత వ్యవహారంలా చంద్రబాబు నిర్వహించాడన్నారు. పేదలు ఎవరైనా రాజధాని మాది.. మంచి అవకాశాలు ఉంటాయనే ఆలోచన లేకుండా చేశాడన్నారు. 

భూసేకరణ చట్టం 2013ను తుంగలో తొక్కి స్విస్‌ఛాలెంజ్, ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో చంద్రబాబు పేదల భూములు లాక్కొని రియలెస్టేట్‌ వ్యాపారం చేశారని పార్థసారధి విమర్శించారు. పేదలు, రైతులకు సంబంధించిన అనేక అంశాలకు అనుగూణంగా చట్టాన్ని రూపొందిస్తే ముఖ్యమంత్రి దానికి తూట్లు పొడిచారన్నారు. హ్యాపీ అమరావతి అంటున్నారు.. ఏ విధంగా అమరావతిలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉంటారని ప్రశ్నించారు. రాజధాని నిర్మానానికి రైతులు 40 వేల ఎకరాలు ఇస్తే వారికి చాలా ఆశలు చూపిండని, వాటిలో ఇప్పటి వరకు ఏమైనా ఇంప్లిమెంట్‌ చేశావా చంద్రబాబూ అని నిలదీశారు. భూములన్నీ విదేశీయులకు ధారాదత్తం చేశాడు కానీ.. ఆ రైతులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబు ఇచ్చిన తెల్లకాగితాలు పట్టుకొని ఆ రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. డ్యాన్స్‌ నేర్పిన బాబాకు వందల ఎకరాలు, విదేశీయులకు వేల ఎకరాలు కేటాయిస్తున్నావే.. రైతులు ఏం పాపం చేశారూ చంద్రబాబు.. మీకు భూములు ఇవ్వడమేనా.. అని విరుచుకుపడ్డారు. నువ్వు.. నీ వర్గం, మీ మంత్రులు, నీ సుపుత్రుడు మీరంతా కలిసి కేవలం వ్యాపారాత్మకంగా రియలెస్టేట్‌గా తయారు చేసి హ్యాపీ అమరావతి అంటే ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారు చంద్రబాబు అని నిలదీశారు. 

రాజధాని నిర్మాణించే భాగ్యం కలగడం సదవకాశంగా భావించకుండా.. దీంట్లో ఎంత పిండుకోవాలని చంద్రబాబు ఆలోచించడం సిగ్గుచేటన్నారు. రాజధాని పేదలకు అందుబాటులో ఉండేలా ఏమైనా చర్యలు తీసుకుంటున్నావా..చంద్రబాబూ అని ప్రశ్నించారు. రియలెస్టేట్‌ వ్యాపారం కోసం రైతుల బతుకుల్లో చంద్రబాబు నిప్పులు పోశాడని పార్థసారధి మండిపడ్డారు. అమరావతి నుంచి జగ్గయ్యపేట వరకు.. అమరావతి నుంచి రేపల్లె వరకు, అమరావతి నుంచి ప్రకాశం జిల్లా వరకు గ్రీన్‌ జోన్‌ అని చెప్పి జీఓ విడుదల చేసి రైతులను బతుకులను చంద్రబాబు నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి మా నెత్తిమీద శటగోపం పెట్టారు. ఏవేవో కలలు చూపించి అంధకారంలోకి నెట్టారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను చూసి ప్రజలంతా అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రజలు కొట్టే రోజు వచ్చిందని చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని హోదా అంటూ నాటకం ఆడుతున్నారని, హోదాపై చిత్తశుద్ధి లేదనేది చంద్రబాబు చరిత్ర చెబుతుందన్నారు. నాలుగేళ్లుగా రూ. 1.20 లక్షల కోట్ల అప్పు చేసి.. కనీసం రూ. 10 వేల కోట్లతో మా ముఖ్యమంత్రి మంచి పనిచేశాడని చెప్పుకునేలా ఏ ఒక్కటైనా చేశావా అని ప్రశ్నించారు. 

చంద్రబాబు ఎందుకు సింగపూర్‌ వెళ్తున్నారో స్పష్టం చేయాలని పార్థసారధి డిమాండ్‌ చేశారు. బహుశా ఇంకో సంవత్సరంలో ఇంటికి వెళ్లిపోయే రోజులు వస్తాయని, వ్యాపారాలు చేసుకునేందుకు వెళ్తున్నారేమోనని అనుమానంగా ఉందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు, అప్పులు చేసిన డబ్బులు ఏం మాయ చేశావోనని ప్రజలంతా అనుమానం పడే పరిస్థితిల్లో చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లడం ఆ డబ్బులు దాచుకోవడానికేనని అర్థం అవుతుందన్నారు. ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చావో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొనడానికి వచ్చిన కంపెనీ ఇప్పుడు మాట మార్చడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ఎవరికీ తెలియకుండా చంద్రబాబు అమర్‌సింగ్‌ను కలిసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో రూ. 20 వేల కోట్లు ఉన్న అగ్రిగోల్డ్‌ ఆస్తులను రూ. 4 వేల కోట్లు అని కంపెనీ మాట్లాడుతుందంటే.. ఏం జరిగింది ఢిల్లీ పర్యటనలో చంద్రబాబూ అని నిలదీశారు. అమర్‌సింగ్‌కు దీంట్లో భాగస్వామ్యమేంటో.. ఎందుకు కంపెనీ మాట మార్చిందో చెప్పాలన్నారు. 
 
Back to Top