హైదరాబాద్‌ నుంచి పరారైన బాబు కేంద్రంపై పోరాటం చేస్తారా?విజయవాడ: తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు హైదరాబాద్‌ను వీడి విజయవాడ ఎందుకొచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి కేంద్రంపై ఎలా పోరాటం చేస్తారా అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ఏపీలో సంక్షేమ పథకాలు పూర్తిగా కుంటుపడ్డాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ కుంభకోణాలన్నింటినీ టీడీపీ బయటపెట్టాలని, టీడీపీ అవినీతి, కుంభకోణాలన్నీ బీజేపీ బయటపెట్టాలని అంబటి డిమాండు చేశారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
Back to Top