వైయస్‌ఆర్‌సీపీ నేత అబంటి రాంబాబహైదరాబాద్ః ప్రతిపక్షనేత వైయస్ జగన్‌పై హత్యాయత్నానికి టీడీపీ ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పుడు ప్రచారం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత అబంటి రాంబాబు ధ్వజమెత్తారు. హైదరబాద్ వైయస్‌ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి జరిగిన హత్యాయత్నం దురదృష్టకరమన్నారు. వైయస్‌జగన్‌పై కోడిపందాలకు వాడే కత్తితో దాడిచేశారని, చాలా మంది తెలియని వారికి ఇది కోడిపందాలకు వాడే కత్తే కదా అని అనుకునే అవకాశం ఉందని కాని ఆ కత్తి మెడకు తగిలితే ప్రాణం పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న కత్తి అనుకోవడానికి వీలులేదని దుండగుడు ఆయన మెడపై వేయడానికి ప్రయత్నం చేశారు. కాని అదృష్టవశాత్తూ భుజానికి తగిలి పెద్ద ప్రమాదం నుంచి జగన్ బయటపడ్డారన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే కొంత ఆందోళన, భయం కలుగుతుందన్నారు. ఇది జరిగిన గంటకే డీజీపీ,అసిస్టెంట్ కమిషనర్, ముగ్గురు మంత్రుల బృందం మీడియాతో మాట్లాడుతూ ప్రచార్భాటం కోసం చేస్తున్న ప్రయత్నాలుగా చిత్రీకరించడం దారుణమన్నారు. ఇలాంటి పోలీసు బాసు ఉన్నప్పుడు విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయా అన్నారు. ప్రజలు వాస్తవాలేమిటో ఆలోచించాలన్నారు. డీజీపీ స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుమానం కలిగిస్తోంది. చంద్రబాబు ఎల్లోమీడియా జగన్‌మోహన్ రెడ్డి పక్కన జూపల్లి శ్రీనివాస్ చిత్రాన్ని అతికించి ప్లెక్సీ వేసి జగన్‌మోహన్ రెడ్డి అభిమాని అంటూ ప్రచారం చేస్తున్నారన్నారని తప్పుబట్టారు. వైయస్ జగన్‌పై గాయం చేసిన వ్యక్తి అభిమాని ఎలా అవుతాడని ప్రశ్నించాడు. దాడి చేసిన వ్యక్తి శ్రీనివాస్ ఎవరో చెప్పారని కాని శ్రీనివాస్ పనిచేస్తున్న క్యాంటిన్ యాజమాని ఎవరనే సంగతి ఎందుకు డీజీపీ చెప్పలేదని ప్రశ్నించారు. క్యాంటిన్ యాజమాని హర్షవర్థన్ ప్రసాద్ అనే టీడీపీ కార్యకర్త అని,టీడీపీ గాజువాక సీటు కావాలని ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డిని కోల్పోయి ఎంతో కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి సమస్యలపై భరోసా ఇస్తున్న వైయస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే మాలాంటి వారి సంగతి ఏమిటని ఆందోళనవ్యక్తం చేశారు.. సంఘటన జరిగిన గంటకే ఇలాంటి తçప్పుడు ప్రచారానికి పూనుకోవడం అనైతికమన్నారు. మసిపూసి మారేడుకాయ చేస్తున్నారన్నారు. ఇది చాలా అన్యాయమన్నారు. టీడీపీ ప్రభుత్వం వికృత రూపం ప్రదర్శిస్తోందని విమర్శించారు.. ముగ్గరు మంత్రులు బృందం మీడియాతో మాట్లాడుతూ సిఐఎఫ్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉండే ఎయిర్‌ఫోర్డు అని, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదనడంలో ఎందుకు కంగారు పడుతున్నారన్నారు.