విజయవాడః కృష్ణ పుష్కరాల నేపథ్యంలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తుల కోసం వైయస్సార్సీపీ సేవా కార్యక్రమాలు చేస్తోంది. వైయస్సార్‌సీపీ అధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేను ఉదయభాను నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పేర వైయస్ జగన్‌మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. పుష్కర యాత్రికులకు జగ్గయ్యపేటలోని బస్టాండ్ ఎదుట సామినేని విశ్వనాధ కాంప్లెక్స్ వద్ద నిత్యం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్, వైయస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి షేక్‌మదార్‌సాహెబ్, వైస్ చైర్మన్ మహమ్మద్ అక్బర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల వెంకటచలం, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.