గ్రేటర్ లో సమీక్షలు

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అందుకు సంబంధించిన కీలక అంశాలపై వైఎస్సార్సీపీ సమీక్షలు జరపాలని నిర్ణయించింది. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షలు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు శ్రీ కె. శివకుమార్ ల ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహిస్తారు. ఈక్రింద పేర్కొన్న నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాల్లో పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాల్సిందిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ కోరారు.

డిసెంబర్ 3న ఉదయం 11 గంటలకు -కుత్బుల్లాపూర్ , అదేరోజు సాయంత్రం 3 గంటలకు -శేరిలింగంపల్లిలో 
డిసెంబర్ 4న ఉదయం 11 గంటలకు -కూకట్ పల్లి, సాయంత్రం 3 గంటలకు మల్కాజ్ గిరిలో
డిసెంబర్ 5న ఉదయం 11 గంటలకు ఉప్పల్  , సాయంత్రం 3 గంటలకు- ఎల్బీనగర్ లో 
డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు- మహేశ్వరం, సాయంత్రం 3 గంటలకు -రాజేంద్రనగర్ లో సమీక్షలు జరుపుతారు . 
Back to Top