వెంటనే చర్య తీసుకోండి..! -గవర్నర్ కు వైఎస్సార్సీపీ విజ్ఞప్తి

హైదరాబాద్: ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ పై చ ర్యలు తీసుకోవాలని గవర్నర్ న రసింహన్ ను వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డిని అనర్హునిగా ప్రకటించాలని విన్నవించింది. ఈ మేరకు పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలతో కూడిన బృందం రాజ్ భవన్ లో కలిసి ఒక విజ్ఞాపన పత్రం అందించింది. కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల్ని ఇందులో వివరించింది.
ప్రకాశం జిల్లాలో జూలై 3వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ కి 496మంది ఎంపీటీసీలు ఉండగా, తెలుగుదేశం పార్టీ కి సంబంధించి 472మంది ఎంపీటీసీలు ఉన్నారు. దీన్ని బట్టి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు తథ్యమన్న సంగతి స్పష్టం అవుతోందని గవర్నర్ కు విన్నవించారు. అయినా సరే, ఈ సీటును దక్కించుకోవాలన ఉద్దేశ్యంతో తెలుగుదేశం కుటిల ప్రయత్నాలు చేస్తోందని వివరించింది.
వైఎస్సార్సీపీ కి చెందిన 35మంది ఎంపీటీసీలకు ఒక్కొక్కరిగా రూ.50వేలు అడ్వాన్సుగా చెల్లించారు. టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయంలో ఈ చెల్లింపులు జరిగాయి. మిగిలిన రూ.2 లక్షలు తర్వాత ఇస్తామని వాగ్దానం చేశారు. తర్వాత వీరందరినీ నెల్లూరు తీసుకొని వెళ్లి అక్కడ సప్తగిరి లాడ్జిలో బంధించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపీటీసీలకు డబ్బు పంపిణీ చేసింది శ్రీనివాసులు రెడ్డి ఆఫీసులో నే అని ఎంపీటీసీలు ఆ తర్వాత మీడియాకు తెలియచేసినట్లు గవర్నర్ కు పార్టీ బృందం వివరించింది.
ఈ ఎపిసోడ్ సంగతి తెలియగానే పార్టీ ఎమ్మెల్యేలు కే శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఆ హోటల్ కు చేరుకొని, ఎంపీటీసీలను విడిపించారు. అప్పుడే మీడియాతో మాట్లాడిన ఎంపీటీసీలు తమకు రూ. 50వేల చొప్పున అడ్వాన్సుగా చెల్లించారని, మిగతా రూ. 2లక్షలు తర్వాత ఇస్తామని హామీ ఇచ్చి హోట ల్ కు తీసుకొని వచ్చారని వివరించారు. డబ్బు చెల్లింపులన్నీ టీడీపీ అభ్యర్థి మాగుంట కార్యాలయంలోనే జరిగాయని స్పష్టం చేశారని గవర్నర్ కు ఈ బృందం తెలిపింది.

చర్యల కోసం వినతి
ఈ మొత్త విషయాల్ని పోలీసులకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని సుబ్బారెడ్డి బృందం ఆవేదన వెలిబుచ్చింది. 35మంది ఎంపీటీసీలను విడిపించాలని  ఒంగోలులోని నియోజకవర్గ రిటర్నింగ్ అదికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినా న్యాయం దక్కలేదని గవర్నర్ కు వివరించారు.

ఈ ఎన్నిక ల్లో వైఎస్సార్సీపీ కి స్వల్ప ఆధిక్యత ఉందని, అందుచేత ఈ 35మంది ఎంపీటీసీ లు నిర్ణాయక ఓటర్లుగా ఉన్నారని గవర్నర్ కు గుర్తు చేశారు. అందుచేత ఈ ఎన్నికల్లో ఈ 35మంది స్వేచ్చగా ఓటువేసేలా చర్యలకు ఆదేశించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకుల బృందం విన్నవించింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించి ఓట్ల కొనుగోలుకి యత్నించటమే కాకుండా, పెద్ద ఎత్తున డబ్బుని ఉపయోగించినట్లుగా రుజువైనందున టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అనర్హులుగా ప్రకటించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తో పాటు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం రాజ్ భవన్ వెలుపల వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ .. వాస్తవాల్ని గవర్నర్ కు విన్నవించామని తెలిపారు. ప్రలోబాలకు పాల్పడుతున్న టీడీపీ అభ్యర్థి ని పోటీనుంచి డి స్మిస్ చేయాలని కోరారు.  కిడ్నాప్ నకు గురైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వచ్చే వరకు ఎన్నికలు నిలిపివేయాలని కోరారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఒక వేళ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.    
Back to Top