వైయ‌స్సార్ సీపీ బహిరంగసభ విజయవంతం చేయాలి

చిట్టమూరు: నెల్లూరు జిల్లా చిట్ట‌మూరు మండ‌ల‌ పరిధిలోని మల్లాం గ్రామంలో ఆదివారం జరిగే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. మల్లాంలో జరిగే ఈ భారీ సభకు నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొవూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జిల్లాలోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీనియర్‌నాయకుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, ఇత‌ర ముఖ్య నాయకులు పాల్గొంటారన్నారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. 

Back to Top