ప్రజాగ్రహాన్ని చూసి బుద్ధి తెచ్చుకో బాబూ?


కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం
– ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
– ప్రత్యేక హోదా సాధనకు విద్యార్థులు, ప్రజా సంఘాలు ఒక్కటయ్యాయి
– విభజన హామీల సాధనపై చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలి
– చంద్రబాబు..మీ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ముందా?
–  మార్చి 5న ఢిల్లీలో ధర్నాకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధం
– రేపు విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు
 
విజయవాడ: ప్రత్యేక హోదా సాధనకు విద్యార్థులు, ప్రజా సంఘాలు ఒక్కటయ్యాయని, ప్రజాగ్రహాన్ని చూసి ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి సూచించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు చేపట్టిన ధర్నా కార్యక్రమాలు విజయవంతం అయినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు గురువారం పార్థసారధి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనకు ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ కూడా పాలుç ³ంచుకొని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని పార్థసారధి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు కలెక్టరేట్‌ముట్టడిలో పాల్గొనందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  చంద్రబాబు ఇప్పటికైనా మీ మోసాలు కట్టిపెట్టి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో మోసం చేశారు. మీ 40 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి ఈ ప్రజలను మోసం చేసేందుకే ఉపయోగించారన్నారు. ఉద్దేశపూర్వకంగా కేసుల నుంచి తప్పించుకునేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. ఇప్పటికైనా సరే ప్రజాగ్రహాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం చేస్తావో? లేక పారిపోతావో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్‌చేస్తున్నాం. మీకు, మీ పార్టీకి రాష్ట్ర భవిష్యత్తును కాంక్షిస్తూ రాజీనామాలు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రంతో ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు సిద్ధమేనా అని నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని, రాష్ట్రానికి నిధులు వస్తాయి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపెరగని ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయస్‌ఆర్‌సీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం మా ఎంపీలతో రాజీనామా చేయించేందుకు వైయస్‌ జగన్‌ సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా సిద్ధమే అన్నారు. నాలుగేళ్లు గా కమ్యూనిస్టులు, ఇతర ప్రజా సంఘాలతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అన్నారు.  కృష్ణా జిల్లాలో కలెక్టరేట్ల ముట్టడికి రాకుండా పార్టీ శ్రేణులను అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు ధ్వంద వైఖరీ అవలంభించారన్నారు. ఒక పక్క చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడుతూ..మరో వైపు ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో చంద్రబాబు కోవర్టుగా మారి ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని ప్రజలు గమనించాలన్నారు. ఇదే తీరుతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ప్రత్యేక హోదా సాధనకు పోరాట పటిమ చూపించాలని కోరారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదా సాధించేందుకు, విభజన చట్టంలోని అంశాలను సాధించేందుకు కార్యాచరణ రూపొందించిందన్నారు. మార్చి 2వ తేదీ 9.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి 5వ తేదీ లోగా ఢిల్లీ నడి వీధిలో పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు ఐదు కోట్ల మంది ఆగ్రహాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నామన్నారు. ఎంతో కాలం మోసం చేయాలని చూస్తే ప్రజలు నీ భరతం పడతారని హెచ్చరించారు. 

బాబు జీవితమంతా మోసాలు, కుట్రలే..
చంద్రబాబు  40 ఏళ్ల రాజకీయ జీవితంలో కుట్రలు, మోసాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగా ఒక్క మంచి పని చేశావా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు భరోసా కల్పించే సందర్భాలు లేవన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అనగానే ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. జీవితంలో మార్పు తెచ్చే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వైయస్‌ జగన్‌ కూడా అలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారన్నారు. మడమ తిప్పం..మాట తప్పకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. నక్క జిత్తుల మోసాలను చంద్రబాబు మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయాలని పార్థసారధి కోరారు.
 
Back to Top