– వైయస్‌ఆర్ హయాంలో విజయనగరం అభివృద్ధి– ఇప్పటికీ వైయస్‌ఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు– టీడీపీ పాలనలో జుట్ మిల్లులకు కరెంటు రూ.8.40కు ఇస్తున్నారు– విజయనగరంలో ఎక్కడైనా మెడికల్ కాలేజీ, స్మార్ట్ సిటీ కనిపించిందా?– జిల్లాలో విష జ్వరాలతో 86 మంది చనిపోయారు– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక చదువుల విప్లవం– చదువులకు ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తోంది

విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో విజయనగరం జిల్లా అభివృద్ధిలో పరుగులు తీస్తే..చంద్రబాబు సీఎం అయ్యాక అభివృద్ధి రివర్స్ గేర్‌లో ఉందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం విజయనగరంలోని మూడు లాంతర్ల జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించారు. వైయస్ జగన్ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో ప్రభుత్వం మూడు లాంతర్ల సెంటర్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఈ చర్యతో ప్రభుత్వ కుట్ర బయటపడింది. అయినా సరే ఏ ఒక్కరూ కూడా కట్టుకదలకుండా జననేత ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ సభలో వైయస్ జగన్ విజయనగరం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి పేరు ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సభలో వైయస్ జగన్ ఏ మన్నారంటే..ఆయన మాటల్లోనే..
– ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు 30 సంవత్సరాల పాటు ఒక పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే అదే నియోజకవర్గంలో గెలిచిన ఆ వ్యక్తి 17 సంవత్సరాలుగా మంత్రిగా, నాలుగు సంవత్సరాలు కేంద్రకేబినెట్ మంత్రిగా ఉన్నారంటే ఏన్నోనో పనులు చేశారన్నాకుంటాం. ఎన్నో అభివృద్ధి పథకాలు వచ్చాయి అనుకుంటాం. కాని ఇక్కడ రీవర్స్‌గేర్‌లో ఉంది. 1983 నుంచి నుంచి ప్రజలు ఇది చేశారు అని గుర్తుపెట్టుకునేలా ఒక్క పని కూడా జరుగలేదని ఇక్కడి ప్రజలు నాతో చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన 2004 నుంచి ఆ ఐదున్నర సంవత్సర కాలం లో వైయస్‌ఆర్ పాలనలో జరిగిన మేలు గురించి అభివృద్ధి గురించి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ప్రజలతు నాతో మంచిని చెప్పుతున్నప్పుడు చాలా సంతోషమేసింది. విజయనగరం, శ్రీకాకుళం ప్రజలకు కలగా మిగిలిపోయిన తోటపల్లి ప్రాజెక్టు, అప్పట్లో చంద్రబాబు నాయుడు 9 సంతవ్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 2004లో వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి కేవలం మూడు కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. తోటపల్లి ప్రాజెక్టు ప్రియతమ సీఎం వైయస్‌ఆర్ హయాంలో 2004 నుంచి రూ. 400 కోట్లు ఖర్చుపెట్టారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేనాటికి తోటపల్లి ప్రాజెక్టు 90శాతం పూర్తయ్యింది. మిగిలిన 10 శాతం ప్రాజెక్టులో కమీషన్లు, లంచాల కోసం కక్కుర్తి పడ్డాడు తప్ప ఆ ప్రాజెక్టు కట్టలని చెప్పి ఏ రోజు ఆలోచన చేయలేదు. 90 శాతం పూర్తయిన తోటపల్లి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు చేసిందేమిటంటే.. ఇళ్లంతా నిర్మించిన తర్వాత ఇంటి గేట్లు పెట్టినట్లు, ఆ ప్రాజక్టు గేట్లు ఎత్తి ఆ ప్రాజెక్టును నేనే కట్టించాను అని బొంకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఇంతటి అన్యాయమైన పాలన జరుగుతున్నపుడు దివంగత వైయస్‌ఆర్ పాలన గురించి ఈ ప్రాంత ప్రజలు గుర్తుతెచ్చుకుంటున్నారు. రూ.118 కోట్లతో జంఝవతి రబ్బరు డ్యాంను ఆసియాలోనే ఎక్కడ చూడని విధంగా వైయస్‌ఆర్ కట్టి చూపించిన ఘనత వైయస్‌ఆర్‌ది. ఇక్కడ ఐదున్నరేళ్ల పాలన గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి కాగానే పెద్దగడ్డ రిజర్వాయర్ ప్రాజక్టు 104 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు మొదలు పెట్టి దానిని పూర్తి చేసి ఏకంగా 12 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత వైయస్‌ఆర్‌ది. – జిల్లా కేంద్రంలో వైయస్‌ఆర్ వస్తే తప్ప జెన్‌టియూ ఇంజనీరింగ్ కాలేజి కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు.ఆంధ్రయూనివర్శి అనుబంధంగా క్యాంపస్ ఏర్పాటు కాని పరిస్థితి ఉందన్నారు. కనీసం జూనియర్ కాలేజి కూడా రాలేని పరిస్థితి గమనించాం. నేటి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతున్నా..– నాలుగున్నర సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాం. చంద్రబాబు హయాంలో ఆయన ఇచ్చిన హామీలకు కూడా దిక్కులేని పరిస్థితిలో విజయనగరం ఉందంటే ఎంతంటి దారుణంగా ఉందో నేను చెప్పాల్సి పనిలేదు. చంద్రబాబు నాయుడు సీఎం కాక ముందు ఇచ్చిన హామీలు విజయనగరంలో మెడికల్ కాలేజి అంట.. మీకు ఎక్కడైనా∙కనిపించిందా? అని అడుగుతున్నా..విజయనగరం స్మార్ట్ సిటీ అన్నారు..మీకు ఎక్కడైన కనిపించిందా అని అడుగుతున్నా..చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇచ్చిన హామీలు గమనిస్తే..జిల్లాలో పుడ్‌పార్కు అంట మీకు ఎక్కడయిన కనిపించిందా?. గిరిజన యూనివర్శిటీ అంట మీకు ఎక్కడయిన కనిపించిందా అని అడుగుతున్నా.– విజయనగరంలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు అంట మీకు ఎక్కడైన కనిపించిందా అని అడుగుతున్నా. విజయనగరంలో లలితా కళల అకాడమీ అంట మీకు ఎక్కడయిన కనిపించిందా..విజయనగరాన్ని పారిశ్రామికనగరంగా చేస్తాడం విజయనగరాని పారిశ్రామిక నగరంగా చేయడం దేవుడెరుగు ఉన్న రెండు జ్యూట్‌మిల్లులు మూతపడుతున్న పరిస్థితి ఉంది. కొత్త ఉద్యోగాలు ఇప్పించడం దేవుడెరుగు.విజయనగరంలో రెండు జ్యూట్ మిల్లులు మూతపడి 12వేల మంది రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అంట.కనిపించయా విమానాలు అని అడుగుతున్నా..ఆయన ముఖ్యమంత్రి అయిన ఆయన ఇచ్చిన మాటలు ఇంత దారుణంగా ఉన్నాయి.అశ్చర్యకరం ఏమిటంటే విజయనగరంలో ప్రభుత్వం తరపున డిగ్రీ కాలేజి కూడా లేని అధ్వాన్న పరిస్థితిలో విజయనగరం ఉంది. డిగ్రీకాలేజి లేని జిల్లా ఏమైనా ఉదంటే అది విజయనగరం జిల్లా మాత్రమే అని అనుకుంటున్నా..ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో మూతపడిన జ్యూట్ మిల్లులు కనిపించాయి. ఆ జ్యూట్ మిల్లుపై ఆధారపడ్డ అక్కాచెల్లెళ్లు నా దగ్గరకు వచ్చారు. అన్నా ఈ జిల్లాలో 8 మంది జ్యూట్ మిల్లులు ఉన్నాయన్నా అందులో నాలుగు మూతపడ్డాయన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అన్నారు. ఒకవైపు జ్యూట్ మిల్లులు మూతపడతా వుంటే మరో వైపు చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వం గోనెసంచులను బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకుంటోంది. ఉన్న జ్యూట్ మిల్లులు మూతపడి ఉద్యోగులు అల్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో జ్యూట్‌మిల్లులో కరెంటు ఎంత అని చూస్తే అప్పట్లో వైయస్‌ఆర్ హయాంలో రూ. 3.15లకు దొరకేంది. ఈరోజు చంద్రబాబు హయాంలో జ్యూట్‌మిమిల్లుకు అక్షరాల 8 రూపాయల 40 పైసాలు వసూలు చేస్తున్నారు. ఇక జ్యూట్ మిల్లులు నడవాలంటే ఎలా నడుస్తాయని చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నాన్నారు. – చంద్రబాబు హయాంలో భీంసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీ, ఇక్కడకు అడుపెడుతున్నప్పుడు దారిపోడవునా రైతన్నలు నాతో మాట్లాడిన మాటలు.. అన్నా మా కర్మ ఏమిటంటే ఏప్పడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారో సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీలని మూతపడుతున్నాయి. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భింసింగి సహకార ఫ్యాక్టరీ మూతపడిపోయిందన్నా అన్నారు. ఆ తర్వాత వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి అయినా తర్వాత 35 కోట్ల రూపాయలు అప్పటికే నష్టాల్లో ఉన్న భీంసింగి ఫ్యాక్టరీని దివంగత వైయస్ రాజేశఖర్æరెడ్డి ఆదుకుని రైతన్నలకు తోడుగా ఉన్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నాన్నగారు మరణించారు మళ్లీ ఈనాడు చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో జరుగుతున్నది ఏంటంటే..ఇదే బింసింగి సహకరా చక్కెర ఫ్యాక్టరీ నాలుగు సంవత్సరాల్ల మళ్లీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. నేటికి ఏకంగా రూ. 48 కోట్ల నష్టాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంతంటి దారుణంగా ఫ్యాక్టరీని నడుస్తున్నాయి.బింసింగ్ సహకారం ప్యాక్టరీలో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది. నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అన్నా మా డబ్బే పెన్షన్ రూపంలో గవర్నమెంట్‌కు కడుతు వచ్చామన్నా..మేము 8.3 శాతం కడితే మరో 8.33 శాతం కట్టి పెన్షన్ ఫండ్‌కు జతచేసిందన్నా. మేం రిటైర్ అయ్యేసరికి 16.66 శాతం మాకు ఇవ్వకుండా కేవలం 8.33 శాతం మాత్రమే మాకు ఇచ్చారన్నా.మిగిలిన 8.33 శాతం డబ్బులు రూ. 12 లక్షలు వారి దగ్గరే పెట్టుకున్నారన్నా. ఇప్పడు మాకు పెన్షన్ 500 నుంచి 100 రూపాయలు ఇస్తున్నారన్నారు. ఆ రూ.12 లక్షలు డబ్బు రూపంలో ఇస్తే బ్యాంకుల్లో వేసుకున్న నెలకు 9వేల రూపాయలు వస్తుంది. అన్నా ఈ సంవత్రసం జనవరి సెప్టెంబర్ వరుకు 9 నెలల కాలంలో ఉత్తరాంధ్రలో 5 లక్షల మంది జ్వరాలతో బాధపడితే విజయనగరంలోనే 86 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. దోమలపై యుద్దమంటారు చంద్రబాబు.. దోమలు వచ్చే ప్రాంతాలను డ్రోన్‌లతో కనిపెడతారంట.దోమలపై యుద్దం చేస్తారంట. జిల్లాలో చంద్రబాబు హయాంలో 27 108 వాహనాలు ఉంటే పది అంబులెన్స్‌లు షెడ్డులో ఉన్నాయి.మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. మిగిలిన అంబులెన్స్ పరిస్థితి చూస్తే వాటి సిబ్బందికి మూడు నెలల నుంచి సిబ్బంది లేని పరిస్థితి ఉంది. ఆరోగ్య పరిస్థితి ఇలా తయారైంది. ఇదే విజయనగరం వేసవి వస్తే తాగునీటి కొరతే..రెండు, మూడు రోజులకో సారి నీరువచ్చే పరిస్థితి ఉంది. తారక రామతీర్థ ప్రాజెక్టు నుంచి తాగునీటిని నిరంతరం సరాఫరా చేయడం కోసం ఆప్రాజెక్టు కట్టి నీరు సరాఫరా చేయాలనే ఉద్దేశ్యంతో వైయస్‌ఆర్ 2007లో రూ. 220 కోట్లతో ప్రాజక్టుకు పనులు ప్రారంభించారు. దివంగత నేత బతికుండగా 30 శాతం పనులు పూర్తి అయ్యాయి. చంద్రబాబు పాలనలో ప్రాజక్టు పనులు ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. విజయనగరానికి తాగునీరు ఇవ్వాల్సిన ఆ రిజర్వాయర్ పూర్తికాలేదు..పైపులైన్లు పూర్తికావు..ఓవర్‌హెడ్‌లు పూర్తికాని పరిస్థితిలో టీడీపీ పాలన సాగుతోంది– భోగాపురం ఎయిర్‌పోర్ట్ చుట్టూ చంద్రబాబు బినామీలకు భూములున్నాయి. చంద్రబాబు నాయుడు కొలువులో మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి అక్కడ భూములున్నాయి. చంద్రబాబు హయాంలో ఎంపీగా ఉన్నవ్యక్తికి భూములున్నాయి. చంద్రబాబు ఆ వ్యక్తులు ముట్టుకోడు. రైతుల భూములను మాత్రం బలవంతంగా లక్కొంటారు. బలవంతంగా లాక్కొన భూములతో అక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మించరా అని చూస్తే అదిలేదు.. ఎయిర్‌పోర్ట్ కట్టడానికి టెండర్లు పిలిస్తే ప్రభుత్వం రంగ సంస్థ తక్కువ ధరకు కోడ్ చేసి పనులను చేజిక్కింది.ప్రభుత్వ రంగానికి అప్పజెప్పితే వారు లంచాలు ఇవ్వరని చంద్రబాబు టెండర్లు రద్దుచేశారు. దేశం మొత్తంలో 130పైగా ఎయిర్‌పోర్టులు ఉంటే అందులో 126 ఎయిర్‌పోర్టులు ఎయిర్‌పోర్ట్ ఆఫ్ ఆధారిటì నడుపుతుంది అలాంటి ఎయిర్‌పోర్ట్ ఆఫ్ ఆధారిటి ఆఫ్‌ఇండియా టెండర్లను రద్దు చేసిన పరిస్థితి. కొత్త టెండర్లు పిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త టెండర్ల ప్రక్రియ ఎయిర్‌పోర్ట్ అధారిటి ఇండియా క్వాలిఫై కాకుండా చేశారు.– అశోకగజపతి రాజు శాఖలోనే చంద్రబాబు అవినీతి చేస్తుంటే ఆయన ఏమి అన్నడం లేదు. ఆయన కేంద్రమంత్రిగా వ్యవహరించారు. నాలుగేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీతో సంసారం చేశారు. చిలకా గోరికలులా కాపురం చేస్తారు. అశోక్‌గజపతి రాజు అక్కడే కేబినెట్‌లో ఉంటాడు. అక్కడ కేబినెట్ మీటింగ్‌లు జరుగుతాయి కాని గిరిజన యూనివర్శిటీ గురించి మాట్లాడడు. రైల్వేజోన్, ప్రత్యేకహోదా గురించి మాట్లాడడు. తన కేసుల కోసం తన స్వార్థం కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారు. చంద్రబాబ పశ్చిమగోదావరికి వెళ్లి ధర్మపోరాట దీక్ష చేస్తాడు. ధర్మపోరాట దీక్షలో కేంద్రంపై ఎన్‌డిఏప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గద్దె దింపుతాం అని మాట్లాడతాడు. బుల్లెట్‌ట్రైన్‌కు లక్షల కోట్లు అంట, అమరావతికి అరకొర నిధులంట అని ధర్మపోరాట దీక్షలో సిఎం అంటాడు. జాతీయ విద్యాసంస్థల పూర్తికావడానికి ధర్మపోరాట దీక్షలట. ఈ పెద్దమనిషి డ్రామాలు గమనించండి. – ఇలాంటి వ్యక్తిని చూసినప్పుడు ఒక కథ గుర్తుకు వస్తోంది. అనగనగా ఒక ముద్దాయి ఉన్నాడు. ఆ ముద్దాయిని తీసుకెళ్ళి కోర్డు బోనులో పెట్టాడు. జడ్జి వచ్చి కుర్చీలో కూర్చోన్నాడు. జడ్జి రాగానే ఆ ముద్దాయి బోరున ఏడవడం మొదలుపెట్టాడు. సార్ తల్లి, తండ్రి లేనివాడిని సార్ నన్ను విడిచిపెట్టండి అని జడ్జితో అన్నాడంట. జడ్జి ఏమో ఆ ముద్దాయి ఏడుపు చూసి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను చూసి ఎందుకయ్యా తల్లి, త్రండి లేనివాడిని తీసుకొచ్చి ఇలా బోనులో పెట్టారయ్యా అని అడిగితే.. సాÆŠ...‡ఈ మనిషి మాటలు నమ్మకండి సార్ తల్లిదండ్రులను చంపేశాడు కాబట్టే ఈ బోనులో నిలబడ్డాడని చెప్పాడంట. ఈ పెద్దమనిషి గురించి పబ్లిప్రాసిక్యూటర్ చెప్పినట్లే ఈ రోజు చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. చంద్రబాబు అధికారం కోసం సొంతమామను వెన్నుపోటు పోడుస్తాడు. ఈ మరణానికి ఈ పెద్దమనిషి కారణమవుతున్నారు. ఎన్నికల వచ్చినప్పుడు ఎన్టీఆర్ పోటోకు దండవేసి ఓట్లు అడుగుతారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రత్యేకహోదా రాలేదంటే దానికి కారణం నువ్వు కాదా? చంద్రబాబు? ఈ పెద్దమనిషి ధర్మపోరాట దీక్ష అంటూ ప్రజల చెవ్వులో కాలి ప్లవర్ పెట్టే పనిచేస్తున్నాడు. 2014లో ఈ రాష్ట్ర్రాన్ని విడుగొడుతూ కేంద్ర ప్రభుత్వం అప్పట్లు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రరాష్టానికి ప్రత్యేకహోదా ఇవ్వండని చెప్పి ప్రణాళిక సంఘానికి ఉత్తర్వులు జారీచేసింది. చంద్రబాబు నాయుడు అదే మాసంలో జూన్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల వరకు ఫైల్ ప్రణాళిక సంఘం వద్ద పెండింగ్‌లో ఉంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. సెప్టెంబర్ 8, 2016లో అరుణజైట్లి అర్థరాత్రి ప్రత్యేకహోదా బదులు ఒక అబద్ధపు ప్యాకేజీ రిలీజ్ చేశారు. అదే కేంద్రప్రభుత్వంలో చంద్రబాబు మంత్రులు లేరా అని అడుగుతున్నాను. ప్రత్యేకప్యాకేజీ విడుదల చేస్తే అరుణ్‌జైట్లికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతాడు. మరుసటి రోజు అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాడు. అంతంటితో అగకుండా ఢిల్లీ వెళ్లి శాలువాలు కప్పి వస్తాడు. ప్రత్యేక హోదాతో ఏం మేలు జరుగుతుందని అని చెప్పి రివర్స్‌గేర్ లో మాట్లాడతారు. ప్రత్యేకహోదా వలన ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చెప్పి ఎదురుప్రశ్న వేస్తారు. జనవరి 27, 2017లో ఈనాడు పేపర్‌లో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఏ రాష్ట్రానికి ఇంతకంటే ఎక్కువ వచ్చాయా అని అడుగుతాడు. మూడు సంవత్సరాలు పాటు బీజేపీ బ్రహ్మండంగా చేసిందని పొగిడిన మాట వాస్తవం కాదా?. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం తానే పెట్టినట్లుగా గొప్పలు చెప్పకుంటాడు. ఇసుక నుంచి మట్టిదాకా అవినీతి జరుగుతంది. ఆరునెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి. అబద్ధాలు చెప్పేవాడు, మోసం చేసేవాడు మీకు నాయకుడిగా కావాలా?– మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే లక్ష్యం. ప్రతి మీటింగ్‌లో ఒక్కొ అంశంపై చెబుతున్నాను. ఈ మీటింగ్‌లో పిల్లల చదువుల కోసం మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.
–ఇవాళ మన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే ఏటేటే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తోంది. అది కూడా ఏడాదిగా అందడం లేదని చెబుతున్నారు. పేదవాడు తన బిడ్డలను చదివించేందుకు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఆ పథకం నీరుగారిపోయింది. నాన్నగారు పేదల కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని మాట ఇస్తున్నాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఉచితంగా చదివిస్తాం. అంతేకాదు హాస్టల్ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇచ్చి తోడుగా ఉంటాం. అలాగే మీ చిట్టిపిల్లలను బడికి పంపిస్తే..ఆ తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేల చొప్పున జమా చేస్తానని మాట ఇస్తున్నాను. మీ పిల్లలను ఏ బడికి పంపించినా డబ్బులు ఇస్తాం. మన పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదివితేనే పేదరికం పోతోంది. ఆ దిశగా చదువుల విప్లవం తెస్తానని మాట ఇస్తున్నాను. ఇందులో ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతూ..మరోమారు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.