అర‌కు ప్లీనరీ విజయవంతం చేద్దాం

విశాఖ‌: ఈ నెల 2న అరకులోయ నియోజక వర్గ కేంద్రంలో త‌ల‌పెట్టిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్టీ ప్లీనరీ  కార్య‌క్ర‌మాన్ని విజయవంతం చేద్దామ‌ని వైస్‌ ఎంపీపీ కూడా పాపారావు అన్నారు.  ప్లీనరీ విజయవంతం చేయాలని కోరుతూ గురువారం డుంబ్రిగుడ, అంత్రిగుడ, కురిడి, జంగిడివలస గ్రామాల్లో ఆయ‌న‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీని మండలంలోని ఉన్న 18 పంచాయతీల సర్పంచ్‌లు,ఎంపీటీసీలు,కార్యకర్తలు అందరు పాల్గొని విజయవంతం చేయాల‌న్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు పరిష్కరం కావలంటే వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల‌న్నారు. ఇందుకోసం పార్టీని బ‌లోపేతం చేద్దామ‌ని కోరారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయితేనే గిరిజన ప్రాంతం అభివృద్ది చెందుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గిరిజనప్రాంతం అభివృద్దిపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో మలేరియా వంటి వ్యాధులు సంబవించి గిరిజనులు మలేరియా,డయేరియా, రక్తహీనతతో మృతువ్యాత చెందుతున్న ప్రభుత్వం గిరిజనుల పట్ల అల్పప్రేమ చూపిస్తుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గిరిజన గ్రామాల్లో నెలకున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారుI 

Back to Top