వైయస్‌ అవినాష్‌రెడ్డి అక్రమ అరెస్టు

చర్చకు వెళ్లనివ్వకుండా పోలీసుల అత్యుత్సాహం
పులివెందుల: వైయస్‌ఆర్‌ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బహిరంగ చర్చకు పులివెందుల చేరుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ఎంపీని పోలీసులు చర్చకు వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వైయస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి పులివెందుల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అదే విధంగా పులివెందులలోని అన్ని మండలాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ, టీడీపీ నేతలను అరెస్టులు చేయకుండా పులివెందులకు పంపిస్తున్నారు. 
 
Back to Top