- హోదా కోసం వైయస్సార్సీపీ అలుపెరగని పోరాటం
- లోక్ సభలో నాలుగో రోజు ఎంపీల ఆందోళన
- ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్
న్యూఢిల్లీ: ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ అలుపెరగకుండా పోరాడుతోంది. ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇటు రాష్ట్రంలోనూ, అటు ఢిల్లీలోనూ మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తోంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తోంది. ప్రత్యేకహోదా సహా విభజన చట్టంలోని హామీల అమలు కోసం టీడీపీ, బీజేపీల దుర్మార్గపు వైఖరిని ఎండగడుతూ ప్రజలను చైతన్యపరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై లోక్ సభలో వైయస్సార్ సీపీ ఎంపీలు వరుసగా నాలుగో రోజూ ఆందోళన కొనసాగించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్ సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హోదా అంశాన్ని లేవనెత్తగా జీరో అవర్ లో మాట్లాడాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు.
ప్రత్యేక హోదాను తక్షణం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే 26 నెలలు గడిచిందని, ఇంకా కాలయాపన చేయొద్దన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వైయస్సార్ సీపీ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.