స్పీక‌ర్ పోడియాన్ని ముట్ట‌డించిన ఎంపీలు

న్యూఢిల్లీ: విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే వెల్‌లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఏపీకి తగిన న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు రాజ్యసభలో విజయసాయిరెడ్డి సైతం విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలో అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా కల్పించాలని, నిధులు కేటాయించాలని పార్లమెంట్‌ ఉభయ సభల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.


 
Back to Top