విశాఖ బహిరంగ సభ చారిత్రాత్మకం కావాలివిశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ నెల 9వ తేదీ విశాఖ నగరంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ నగరంలో బహిరంగ సభ చారిత్రాత్మకం కావాలని, పాదయాత్ర చరిత్రలో విశాఖ జిల్లా సువర్ణాక్షరాలతో లిఖించబడేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ జిల్లాలో 12 స్థానాల్లో గెలుపొందామని, 2019లో 15 నియోజకవర్గాలు కైవసం చేసుకుందామని పిలుపునిచ్చారు. 
 
Back to Top