చంద్ర‌బాబుకు సిగ్గూ శరం లేదు

 హైదరాబాద్‌: కొంచెం కూడా సిగ్గూ శరం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అదే చంద్రబాబేనని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ, చంద్రబాబుల స్నేహ బంధంపై ఆయ‌న ట్విటర్‌ ద్వారా స్పందించారు. పొలిటికల్‌ దళారి చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తారని విమర్శించారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీని రాక్షసి అని, కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని, తరిమి కొట్టాలని పెడబొబ్బలు పెట్టాడని చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ కాళ్లు పట్టుకుని ప్రజాస్వామ్యం కాపాడుదామని అంటున్నారని దుయ్యబట్టారు.   


Back to Top