100 మంది ఎంపీల మద్దతు ఉంది

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి 100 మంది ఎంపీల మద్దతు ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. హోదా సాధనకు ఈ నెల 16న కేంద్రంపై వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయన్నారు.  టీడీపీ ఎంపీలు కూడా తమతో కలిసి పోరాటం చేయాలని ఆయన సూచించారు.
 
Back to Top