రంగారావుకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప‌రామ‌ర్శ‌

ప్ర‌కాశం:  వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు చిట్నీడి రంగారావును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామ సర్పంచ్, వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రంగారావు తల్లి నారాయణమ్మ గతనెల 26న అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్ది పొందూరు గ్రామానికి విచ్చేసి రంగారావును ఆయన నివాసంలో పరామర్శించి నారాయణమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.  

వేజండ్ల సుబ్బులుకు నివాళి..

పొందూరు గ్రామంలోనే గుండె పోటుతో మరణించిన వేజండ్ల సుబ్బులు కుటుంబాన్ని కూడా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆమె కొడుకు సుధాకర్‌తో మాట్లాడారు. దివ్వాంగుడైన సుధాకర్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చాలా కాలంగా మంచానికే పరిమితమై ఉన్న సుధాకర్‌కు వికలాంగులకిచ్చే పింఛన్‌ రావడం లేదని తెలుసుకుని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీకి ఓటేస్తున్నారన్న కారణంతో అన్ని అర్హతలున్నా టీడీపీ నాయకులు లబ్ధిదారులకు పింఛన్‌లు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని సుధాకర్‌కు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ నాయకులు చిట్నీడి రంగారావు, వేజండ్ల సుబ్బారాయుడు, రాయండ్ల నర్సింగరావు, ఏలూరి వంశీ, రావిపాటి రామకృష్ణ, భీమవరపు అంకయ్య తదితరులు పాల్గొన్నారు. 

Back to Top