వైయస్‌ఆర్‌ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం

దమ్ము లేక టీడీపీ తోకముడిచింది
లాండ్‌ ఆర్డర్‌ సమస్య అంటూ కుంటిసాకులు
వైయస్‌ఆర్‌ సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
పులివెందుల పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్న ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల: చర్చకు వచ్చే దమ్ము లేక టీడీపీ తోకముడిచిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పులివెందలలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పులివెందుల చేరుకున్న వైయస్‌ అవినాష్‌రెడ్డి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సతీష్‌రెడ్డికి దమ్ముంటే పూలంగళ్ల సర్కిల్‌లో చర్చకు రావాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిపై చర్చకు పులివెందుల రావడానికి సతీష్‌రెడ్డికి ఇబ్బంది అయితే వేంపల్లి క్రాస్‌రోడ్డుకు రావడానికైనా సిద్ధంగా ఉన్నానని మార్చి 1న జరిగిన ప్రత్యేక హోదాలో చెప్పడం జరిగిందన్నారు. 4వ తేదీన పూలంగళ్ల సర్కిల్‌లో చర్చపెడతామని చెప్పిన సతీష్‌రెడ్డి ఇప్పుడు తోకముడిచి లాండ్‌ ఆర్డర్‌ సమస్య అంటూ కుంటిసాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడన్నారు. ఈ రోజు చర్చకైనా.. రచ్చకైనా సిద్ధమని పేపర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడని, అంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేంది ఎవరూ అని ప్రశ్నించారు. 

ప్రభుత్వం మీది.. లాండ ఆర్డర్, పోలీస్‌ వ్యవస్థ అన్నీ టీడీపీ నేతల్లో ఉన్నా సతీష్‌రెడ్డి ఎందుకు చర్చకు రావడానికి భయపడుతున్నారని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. పోలీసు బందోబస్తు నడుమ ప్రజల సమక్షంలో పులివెందులల్లో వైయస్‌ఆర్‌ చేసిన అభివృద్ధిని ప్రజలనే అడిగి తెలుసుకుందామన్నారు. అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పులివెందులను ఎంత నిర్లక్ష్యానికి గురిచేసిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చకు లాండ్‌ ఆర్డర్‌ సమస్య అయితే ఒక్కడినే రావడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీ నేతలను మాత్రం వాహనాల్లో ఎక్కించి పులివెందులకు పంపుతున్నారన్నారు. 
 
Back to Top