పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం


– టీడీపీ పాలనలో అన్నింటా అవినీతి
– పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక్క ప్రాజెకై్టనా తెచ్చారా?
– చింతమనేనిని ఎందుకు అరెస్టు చేయడం లేదు?
ఏలూరు: వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ఎమ్మెల్సీ ఆళ్లనాని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక్క ప్రాజెకై్టనా వచ్చిందా అని ప్రశ్నించారు. పోలవరంపై అవినీతి ఆరోపణలు వచ్చినా చంద్రబాబు నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శించారు. 2018 నాటికి గ్రావిటీతో నీళ్లిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మట్టి నుంచి ఇసుక వరకు అన్నింటా దోపిడీనే ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన విమర్శించారు. చింతమనేని రౌడీయిజంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. దళిత కార్మికుడిని కొట్టిన చింతమనేనిని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. టీడీపీ నాయకులకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
Back to Top