నల్లదుస్తులతో అసెంబ్లీకి వెళ్లనున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ః రేపు నల్ల దుస్తులతో సభకు హాజరుకావాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన పార్టీ నేతలు...రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై చర్చంచారు. ఇది ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి రోజుగా అభివర్ణించారు. రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ నల్లదుస్తులతో అసెంబ్లీకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించిన టీడీపీ నియంతృత్వ వైఖరిని ఎండగట్టనున్నారు.

Back to Top