హైదరాబాద్) రాజధానిలో టీడీపీ భూ దురాక్రమణపై సీబీఐ విచారణ కోరినందుకు ప్రభుత్వం వైఎస్సార్సీపీ సభ్యులను సభ నుంచి సస్సెండ్ చేయించింది. మంత్రి యనమల చెప్పిందే తడవుగా స్పీకర్ సస్పెన్షన్ ను చదివేశారు. రాజధానిలో ప్రభుత్వ భూదందాపై ప్రతిపక్ష నేత ప్రసంగిస్తున్న ప్రతీసారి చంద్రబాబు తన మంత్రులను ఉసిగొల్పి చర్చను పక్కదారి పట్టించేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. <br/>రాజధానిలో జరిగిన భూదందా ఇన్ సైడెడ్ ట్రేడింగ్ కన్నా ఘోరమైన నేరమని...దీనిపై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐనా చంద్రబాబు అందుకు ససేమిరా అన్నారు. భూములు కొన్నాం తప్పేంటి, విచారణ జరిపించేది లేదంటూ అధికార దర్పం ప్రదర్శించారు. రాజధాని ముసుగులో పేదల నోళ్లు కట్టిన ప్రభుత్వ భూ కుంభకోణాలపై... సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని వైఎస్సార్సీపీ పట్టుబట్టింది.