హైదరాబాద్) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సర్వేయర్లను నియమించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి దీని మీద ప్రభుత్వానికి విన్నవించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో భూముల లావాదేవీలకు సంబంధించి చాలా లావాదేవీలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం తరపున సర్వేయర్లు లేకపోవటంతో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు సర్వేయర్ల మీద ఆధార పడితే మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి సమాధానం చెప్పారు.