సంతలో పశువుల మాదిరి కొంటున్నారు

అమరావతిః వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, రక్షణ నిధి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పీకర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.


పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి 
టీడీపీ లో చేరిన ఎమ్మెల్యే ను అనర్హులుగా చేయాలని స్పీకర్ ను కోరామని వైయస్సార్సీపీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో కూడా టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోమని కోరామన్నారు. చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్లు మా ఎమ్మెల్యేను కొంటున్నారని, రాజ్యాంగానికి విరుద్ధంగా వారిలో నలుగురుకి మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు. వైయస్ హయాంలో 500 రోజులకు పైగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే...చంద్రబాబు నాలుగు సంవత్సరాల్లో 80 రోజులు మాత్రమే సభను నడిపించారని మండిపడ్డారు. అసెంబ్లీలో న్యాయం జరగలేదు కాబట్టే జగన్ పాదయాత్ర ప్రారంభించారన్నారు. ఫిరాయిపులకు వ్యతిరేకంగా అసెంబ్లీ బహిష్కరించామని చెప్పారు.
చంద్రబాబుకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. ప్రజా క్షేత్రంలో ఎవరి బలమెంతో తెల్చుకుందామన్నారు. పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చేచేందుకే బాబు వైయస్ జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు భజన చేసేందుకె అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. నంద్యాల ఎన్నికలో టీడీపీదీ గెలుపు కాదని, బలుపని అన్నారు. వైయస్ జగన్ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని, తమ పార్టీలోకి వచ్చిన చక్రపాణి రెడ్డితో రాజీనామా చేయించారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికార మదంతో  వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కోన రఘుపతి
సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడం కోసమే సభను బహిష్కరించామన్నారు.  దాదాపుగా 16 నెలలు నుంచి ఫిరాయిపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తిరుగుతున్నా స్పీకర్ పట్టించుకోవడం లేదన్నారు. తలసానిని టీఆర్ఎస్ లో చేర్చుకుంటే సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారన్న చంద్రబాబు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నింతారు. ఫిరాయిపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీ కి హాజరవుతామన్నారు. 
Back to Top