ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరం

అమరావతిః రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు విస్మరించారని  వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్ రెడ్డి, సునీల్ కుమార్ లు మండిపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించాకే అసెంబ్లీని నడపాలని ఇటీవల తమ నాయకుడు వైయస్ జగన్ రైతు దీక్షలో స్పష్టం చేశారని గుర్తు చేశారు. మిర్చీ ధరలు రోజురోజుకూ పడిపోతూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న దుర్భర పరిస్థితులు నెలకొంటే...విదేశీ పర్యటనల పేరుతో బాబు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం దురదృష్టకరమన్నారు. తమ నాయకుని ఆదేశానుసారం అసెంబ్లీలో రైతుల సమస్యలపై పట్టుబడుతామని చెప్పారు. అదేవిధంగా ప్రత్యేకహోదాపైనా చర్చకు పట్టుబడుతామన్నారు.  హోదాపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top