వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల పాదయాత్ర

హైదరాబాద్: శాసనసభలో ప్రతిపక్షాన్ని విప్పనివ్వని గొంతును, ప్రజల్లో విప్పాలని ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధపడింది.  స్పీకర్‌ తీరుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం  లోటస్‌పాండ్‌ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్ళి అక్కడ ధర్నా చేపట్టనున్నారు.

ఇందులో భాగంగా వారంతా ముందుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయల్దేరారు.  ఫ్లకార్డులు చేతబట్టి, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. అలాగే వైఎస్ఆర్ సీపీ మంగళవారం  శాసనసభ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించనుంది.
Back to Top