రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డివైయస్ఆర్ జిల్లా: నిత్యం ప్రజల్లో ఉండే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని లక్కిరెడ్డిపల్లి మండలం గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకుసాగారు. నవరత్నాలను అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రూ. లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు.