కరువు విలయతాండవం చేస్తున్నా క‌నిపించ‌దా?


వైయ‌స్ఆర్ జిల్లా:  రాష్ట్రంలో క‌రువు విల‌య‌తాండ‌వం చేస్తున్నా ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా అని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి మండిప‌డ్డారు. క‌డ‌ప క‌లెక్ట‌రేట్ ఎదుట చేప‌ట్టిన వైయ‌స్ఆర్‌సీపీ ధ‌ర్నాలో ఆయ‌న మాట్లాడుతూ..వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు న్యాయం జరగడం లేదని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  జిల్లాలో ఇప్పటివరుకు 50 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన సాయం అందలేదన్నారు. వర్షాలు లేక పంటలు ఎడిపోతున్న రైతులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. పంటరుణాలు,బీమా కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.కరవు విలయతాండవం చేస్తున్న ప్రభత్వుంలో చలనం లేదన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజలను మోసగించి 86 వేల కోట్లు రూపాయలు మాఫీ చేయవలసి ఉండగా కేవలం 20 వేల కోట్లు రుణమాఫీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుని రైతులకు మేలు చేసే ప్రభుత్వం సిగ్గుచేట్టన్నారు. ధ‌ర్నాలో తాజా మాజీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మేయ‌ర్ సురేష్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.
Back to Top