<br/><br/>చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విద్యాభివృద్ధికి తన వంతు సాయం అందజేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఆమె ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. బుధవారం వడమాలపేట మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్యాన్లను పాఠశాలల హెచ్ఎంలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ బిడ్డలను చదించుకుంటే పేదరికం నుంచి బయటపడవచ్చు అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్ జగన్ చదువుల విప్లవం తెస్తారని, మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా జగనన్నే భరిస్తారని చెప్పారు. అంతేకాదు హాస్టల్ ఖర్చుల నిమిత్తం ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు అందజేస్తారన్నారు. చిన్న బిడ్డలను బడికి పంపిస్తే అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తారని రోజా వివరించారు.