ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త చంద్రబాబే

రక్షణ కల్పించిన ప్రభుత్వం కుట్రలు చేస్తోంది...
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా..
తిరుపతిః ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త చంద్రబాబేనని వైయస్‌ఆర్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు, శివాజీ కలిసి జగన్‌ను అంతం చేయడానికి ప్రయత్నించారన్నారు. అందుకే శివాజీ అమెరికా పారిపోయాడన్నారు. గతంలో చంద్రబాబు కేబినెట్‌లో శివాజీ పాల్గొన్నాడని వార్తలు వచ్చాయన్నారు. టీడీపీతో శివాజీకి సంబంధం లేకపోతే అతన్ని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు డ్రామా అంటున్నారని మండిపడ్డారు. హత్యాయత్నం జరిగిందని రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టంగా ఉందన్నారు. అనేక కేసులున్న శ్రీనివాస్‌ను ఎయిర్‌పోర్ట్‌ రెస్టారెంట్‌ యాజమాని హర్షవర్ధన్‌ తన వద్ద ఎందుకు పెట్టకున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. వైయస్‌ జగన్‌పై కుట్ర జరిగితే.. ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు చేయడంలేదని  ప్రశ్నించారు. ఐదుసార్లు ఓడిపోయినా, నెల్లూరు ప్రజలు ఛీ కొట్టినా మంత్రి పదవి తీసుకుని సోమిరెడ్డి వె్రరీ కూతలు కూస్తున్నాడని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. టీడీపీ నేతలు రౌడీల్లాగా,గుండాల్లాగా దిగజారి మాట్లాడుతున్నారన్నారు.  ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు  ఆడుతున్నారన్నారు.  ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్‌ యాజమాని టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఎన్నికల్లో పాడేరులో డబ్బులు పెంచిన విషయం,  గాజువాక టీక్కెట్‌ కోసం ప్రయత్నించినట్లు చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.  ఘటన జరిగిన గంటలోపే నిందితుడి శ్రీనివాస్‌ను వైయస్‌ఆర్‌సీపీ అభిమానిగా ప్రచారం చేసారని, ఇది పథకం కాదా..సమాధానం చెప్పాలన్నారు. నిందితుడు  దాడి చేసిన  కత్తి రెస్టారెంట్‌లో జనవరి నుంచే వుందని విచారణలో పోలీసులే తెలిపారన్నారు. ఎయిర్‌పోర్ట్‌లోకి రావాలంటే  కేసులు ఉండకూడదని, నిందితుడు శ్రీనివాస్‌పై కేసులున్నా ఎన్‌వోసి సర్టిఫికెటు ఎలా ఇచ్చారన్నారు.  శ్రీనివాస్‌ తన గ్రామంలో కోటి రూపాయాలకు భూములు కొనడానికి బేరం అడిన సంగతి తెలియదా అన్నారు. ఆ కుట్రవెనుక ఎంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించారో సమాధానం చెప్పాలన్నారు. రెండువారాల క్రితం రెస్టారెంట్‌ యాజమాని హరిశ్చంద్రప్రసాద్‌ చౌదరి వైయస్‌ జగన్‌కు బయటకు నుంచి కాఫీ రాకూడదని ఎయిర్‌పోర్ట్‌ ఛీప్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారన్నారు.దాని ప్రకారం సెక్యూరిటీ ఆఫీసర్లు రెస్టారెంట్‌లో మాత్రమే తాగాలని చెప్పారన్నారు. ఆ తర్వాత  కాఫీ ఇవ్వడానికి వచ్చి వారి మనుషులు వచ్చి దాడి చేశారన్నారు. ఇది అంతా పథకం కాదా అని ప్రశ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top