ప్రజాబంద్‌ను అణగదొక్కాలనుకోవడం సిగ్గుచేటు




బీజేపీ, టీడీపీ దుర్మార్గాలకు నిరసనగా రాష్ట్రబంద్‌
హోదాకు రాకుండా అడ్డుకుంది చంద్రబాబే
చంద్రబాబును వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి
ఓటుకు కోట్ల కేసు పంచాయతీని బయటపెట్టాలి
హోదాను బతికించింది వైయస్‌ జగన్‌ ఒక్కరే
చిత్తూరు: అధికార అహంకారంతో పోలీసులను ఉపయోగించి ప్రజాబంద్‌ను చంద్రబాబు అణగదొక్కేయాలనుకోవడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా హోదాను సమాధి చేసిన బీజేపీ, టీడీపీ దుర్మార్గానికి రాష్ట్ర వ్యాప్త బంద్‌కు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారన్నారు. ఈ మేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి బంద్‌లో పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆర్కే రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు లాలూచీ రాజకీయాలకు నిరసనగా బంద్‌ జరుగుతుంటే.. చంద్రబాబు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ రాష్ట్రానికి అన్యాయం చేసినా వారికేమీ తెలియనట్లుగా కొంగజపం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రజాడబ్బుతో పోలీసులను కాపలా పెట్టుకొని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారన్నారు. హోదా కావాలని ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. 

పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబే కోరినట్లుగా లోగుట్టు బహిర్గతం చేశారన్నారు. కెమెరాలు ఉన్నాయని టీడీపీ ఎంపీలు, మంత్రులు డ్రామాలు ఆడుతున్నారన్నారు. లోక్‌సభ సాక్షిగా బీజేపీ, టీడీపీ లాలూచీ రాజకీయాలు బయటపడ్డాయన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనని ప్రధాని చెప్పిన తరువాత ఇంకా పదవులు పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజీనామాలు చేసి నిరాహార దీక్షలుకు కూర్చొండి.. మా ఎంపీలను కూడా పంపిస్తానన్న వైయస్‌ జగన్‌ మాటలకు చంద్రబాబు సిద్ధపడాలన్నారు. 

ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఇంత గొప్ప ప్యాకేజీ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని అసెంబ్లీలో గొప్పలు చెప్పింది మర్చిపోయారా చంద్రబాబూ అని రోజా ప్రశ్నించారు. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా సంజీవనా.. నన్ను ఎడ్యుకేట్‌ చేయండి అని మాట్లాడారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ పోరాటాలతో హోదా ప్రజలందరిలో బలంగా నాటుకుపోవడంతో యూటర్న్‌ తీసుకున్నారన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని, వెంటనే చంద్రబాబును ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీ నేను, గవర్నర్‌ కలిసి కేసీఆర్, చంద్రబాబుకు రాజీ కుదిర్చామని చెప్పారు. ఓటుకు కోట్ల కేసులో రాజీ కుదిర్చారా..? ఓటుకు కోట్ల కేసు పంచాయతీ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ తాకట్టుపెట్టారన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసిన మోడీని, చంద్రబాబును ఎవరూ క్షమించరన్నారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని, హోదా బతికి ఉండటానికి వైయస్‌ జగనే కారణమన్నారు. 
Back to Top