రైతు కళ్లలో సంతోషం చూడాలని వైయస్‌ఆర్‌ జలయజ్ఞం

వైయస్‌ఆర్‌ జిల్లా: రైతుల కళ్లలో సంతోషం చూడాలని కోటి ఎకరాలకు నీరు ఇచ్చేందుకు జలయజ్ఞం కార్యక్రమం చేపట్టిన మహానుభావుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు అనేది రాకుండా రైతులు రెండు పంటలు పండించుకోవాలని తపించిన వ్యక్తి వైయస్‌ఆర్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కరువు ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ. 1.5 లక్షల కోట్లతో వైయస్‌ఆర్‌ జలయజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టి ఐదేళ్లలో 80 శాతం పూర్తి చేశారన్నారు. ప్రజలే తానుగా భావించి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను పాదయాత్ర ద్వారా కళ్లారా చూశారు కాబట్టే వారి సంతోషం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగా ప్రాజెక్టులు చేపట్టారన్నారు. 
Back to Top