టీడీపీది నయవంచన దీక్ష



– అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది
– టీడీపీ దీక్షలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
వైయస్‌ఆర్‌ జిల్లా: కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ చేస్తున్నది దొంగ దీక్షలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కడపలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో టీడీపీ దీక్ష కార్పొరేట్‌ దీక్ష అన్నారు. ఈ దీక్షకు జనాలు రాకపోతే  చంద్రబాబు అధికారులందరినీ పంపిస్తున్నారన్నారు. ప్రభుత్వ దుర్వినియోగం పరాకాష్టకు చేరిందన్నారు. గతంలో చంద్రబాబు మీటింగ్స్‌కు డ్వాక్రా మహిళలను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ అధికారులందరినీ వారి దీక్షలకు తరలిస్తున్నారన్నారు. టీడీపీ దీక్షలో చిత్తశుద్ధి లేదన్నారు. ఈ నాలుగేళ్లలో ఆ పార్టీ వైఖరి ఏంటో ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నాయకులు చేస్తున్నది నిరాహారదీక్ష కాదని..నయ వంచన దీక్ష అని అభివర్ణించారు. షుగర్, బీపీ లేని వ్యక్తులే నిరాçహార దీక్ష చేసేందుకు సాధ్యపడుతుందని, అలాంటిది సీఎం రమేష్‌కు 260 షుగర్‌ లెవల్స్‌ ఉండి ఇన్ని రోజులు ఎలా దీక్ష చేశారని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దీక్షలపై కడపలో ఎవరిని అడిగినా సత్యం చెబుతారన్నారు. రమేష్‌ తాగే నీళ్లు మాత్రం లీటర్‌ రూ.3 వేల విలువ ఉంటుందని చర్చించుకుంటున్నారన్నారు. ప్రతి అర్ధగంటకు గదిలోకి వెళ్లి వస్తున్నారన్నారు. కీటోన్లు పెరిగి, కిడ్నీ పాడై పోతుందని, అలాంటిది రమేష్‌ మాత్రం కొత్త పెళ్లి కొడుకు మాదిరిగా నిగనిగలాడుతున్నారన్నారు. ఇలా దొంగ దీక్షలు చేస్తే కేంద్రం తప్పుగా అర్థం చేసుకుంటుందన్నారు. ఈ దీక్ష కార్పొరేట్‌ దీక్ష అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని, శ్వేతపత్రంవిడుదల చేయాలన్నారు. ఈ దీక్షకు వెళ్తే మనిషికి రోజుకు రూ.500 డబ్బులు, బిర్యాని ప్యాకెట్, బ్రాందీ బాటిల్‌ ఇస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులందరూ దీక్ష శిబిరంలో కూర్చుకోవడం బాధాకరమన్నారు. టీడీపీకి సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. 
 
 
Back to Top