ప్రజాస్వామ్య దేశం కాబట్టి చంద్రబాబు బతికిపోయాడు

వైయ‌స్ఆర్‌ జిల్లా:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుపై  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారని చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి రవీంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మన దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి చంద్రబాబు బతికిపోయాడని అన్నారు. శ‌నివారం ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని, రైతు రుణమాఫీ అని మాయమాటలు చెప్పి రైతులను మోసగించారని విమర్శించారు. రూ.5 వేల కోట్లతో రైతులకు మద్ధతు ధరలు కల్పిస్తామని మరిచిపోయారని ధ్వజమెత్తారు. పంటలకు మద్ధతుల ధరలు కల్పించకపోతే భవిష్యత్‌లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


Back to Top