<img src="/filemanager/php/../files/untitled folder/puspa.png" style="width:1235px;height:490px"><br>విజయనగరంః జన ప్రభంజనాన్ని చూస్తుంటే పార్వతీపురానికి సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లు వుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాజన్న రాజ్యం జగనన్న ఎప్పుడు వస్తాడా అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్యాయం, అరాచక పాలన చేస్తోందన్నారు. చివరికి జననేతపై హత్యయత్నం కుట్రకు కూడా తెగబడ్డారని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ఆర్ మరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే మరో 30 ఏళ్లు టీడీపీకి పుట్టగతులు ఉండవనే భయంతో జగనన్నను మట్టుబెట్టే ప్రయత్నం చేశారన్నారు. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను అని విజయమ్మ తెలిపారని వైయస్ జగన్‌ను కంటికి రెపలా కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపైనా ఉందన్నారు.