పోలీసు స్టేషన్‌ ఎదుట ఎమ్మెల్యే పిన్నెళ్లి బైఠాయింపు


గుంటూరు: గురజాల పోలీసు స్టేషన్‌ ఎదుట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి బైఠాయించారు. వైయస్‌ఆర్‌సీపీ నేత నరసింహారావును అక్రమంగా అరెస్టు చేయడంపై పిన్నెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు వేధిస్తున్నారంటూ నరసింహారావు కుటుంబ సభ్యులు ఆరోపించారు. డీఎస్పీతో మాట్లాడేందుకు గురజాలకు వచ్చిన పిన్నెళ్లికి డీఎస్పీ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌ ఎదుట  బైఠాయించి ఆందోళన చేపట్టారు. 
  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top