జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి మాట్లాడితే నాలుక కోస్తాం


 
– వైయస్‌ జగన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి పిచ్చికూతలు కూస్తున్నారు
– జేసీ సోదరుల భాషా ఎలా ఉందో అందరూ చూస్తున్నారు
– విశాఖలో దళితుల నుంచి 2 వేల ఎకరాల భూమి లాక్కున్నారు
– దళితుల భూములు చంద్రబాబు సొంత మనుషులకు కేటాయించారు
– ప్రభుత్వ సొమ్ముతో ధర్మ పోరాట సభలా?


హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి  పిచ్చికూతలు కూస్తే సహించేది లేదని, మరోసారి ఇలాగే మాట్లాడితే నాలుక కోస్తామని ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో ధర్మ పోరాట సభలు ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.  జేసీ సోదరుల భాష ఎలా ఉందో అందరూ గమనిస్తున్నారని చెప్పారు.  జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడిన తీరు అసహ్యంగా ఉందన్నారు. సీఎం సభలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రతిపక్ష నేతపై  పిచ్చికుక్క మాట్లాడినట్లు మాట్లాడటం సరికాదన్నారు.ప్రజల సొమ్ముతో ధర్మ పోరాట సభలు పెట్టి ప్రతిపక్ష నేతను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. నిన్న అనంతపురం సభలో జేసీ దివాకర్‌రెడ్డి మా నాయకుడు వైయస్‌ జగన్‌పై మాట్లాడటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు జిల్లాకోకరిని ఇలాంటి నాయకులను తయారు చేశారన్నారు. అనంతపురం జిల్లాలో జేసీ సోదరుల తీరు దారుణంగా ఉందన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. మరోసారి వైయస్‌ జగన్‌పై నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని, ప్రజలే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. ధర్మ పోరాట సభల్లో ప్రతిపక్ష నేతపై అసభ్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 
దళితుల భూములు లాక్కొని బినామీలకు ఇస్తున్నారు
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా దళితుల భూములు లాక్కొని చంద్రబాబు తన బినామీలకు కట్టబెడుతున్నారని ఎమ్మెల్యే కోరముట్లశ్రీనివాసులు విమర్శించారు. విశాఖలో రెండు వేల ఎకరాల దళితుల భూములు లాక్కొని చంద్రబాబు తన సొంత మనుషులకు కట్టబెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో భూకేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వింతపోకడలు మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 

తాజా వీడియోలు

Back to Top