<strong>విలువలు,విశ్వసనీయత గల నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి..</strong>శ్రీకాకుళంః వైయస్ జగన్ రాకతో పాలకొండ..పాలకుండగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి అన్నారు.పాలకొండ నియోజకవర్గంలో వైయస్‌ఆర్ హయాంలో లబ్ధి చేకూరని వారు ఎవరులేరన్నారు.విలువలు,విశ్వసనీయత గల నేతగా వైయస్ జగన్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారన్నారు. జననేతకు విశేష ప్రజాదరణ లభించడంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వైయస్ జగన్‌ను అంతం చేయడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. వైయస్ జగన్‌కు ప్రజలంతా అండగా ఉన్నారన్నారు. వైయస్‌ఆర్ హయాంలో రైతాంగానికి ఎన్నో మేలు జరిగిందన్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారన్నారు. ప్రజా సమస్యలను టీడీపీ ప్రభుత్వం గాలికొద్దిలేసిందన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పూర్తికాలేదని, రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. గిరిజనులు సంక్షేమ,అభివృద్ధి పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జంపరకోట ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమయిందని, ముందుకు సాగడంలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తుందన్నారు.