బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన రాకపోవడం బాధాకరం

కర్నూలు: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా ప్రస్తావన రాకపోవడం బాధాకరమని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. గురువారం పట్టణంలోని ఆయన స్వగృహాంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ..ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రైతులందరికీ పావులా వడ్డీకే రుణాలు ఇస్తే కేంద్రం ఆ ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుందని ఐజయ్య తెలిపారు.   
Back to Top