వితరణ చాటుకొన్న వైయస్సార్సీపీ ఎమ్మెల్యే

నెల్లూరు)) ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవటంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బాటలో పార్టీ ఎమ్మెల్యేలు నడుస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఆదరణ చాటుకొన్నారు.

నెల్లూరు జిల్లా 49 వ డివిజన్ శాంతి నగర్ లో శ్రీధర్ రెడ్డి ప్రజా బాట నిర్వహించారు. అరుంధతీయ పాలెంలో సర్వం కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితుల్ని పలకరించారు. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సాయం లేకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సహాయ సామగ్రి తెప్పించి బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మీ సునంద, అధికార ప్రతినిధి శ్రీకాంత్ పాల్గొన్నారు. 
Back to Top