డిఎస్సీ అభ్యర్థులకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు..
నిరుద్యోగల పాలిట శని చంద్రబాబు..
అరెస్ట్‌ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలి
వైయస్‌ఆర్‌సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి 
తిరుపతిః ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న డిఎస్సీ అభ్యర్థులకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపింది. 20 మంది అభ్యర్థులను అరెస్ట్‌ చేయడం పట్ల ఖండించారు. అరెస్ట్‌  చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసుల రెడ్డి డిమాండ్‌ చేశారు.  చంద్రబాబు పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.. డిఎస్సీ ద్వారా ఇప్పటివరుకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో 50వేల పోస్టులు భర్తీ చేశారని గుర్తు చేశారు.  నిరుద్యోగుల పాలిట చంద్రబాబు శనిలా మారారని దుయ్యబట్టారు.2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం యువతను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగాలను భర్తీచేయకపోగా నిరుద్యోగులపై అరాచక చర్యలకు పాల్పడుతుందన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top