విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామివిజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ విజయనగరం వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి పేరును ప్రకటించారు. అశేష జనవాహిని నడుమ వైయస్‌ జగన్‌ కొలగట్ల పేరు ప్రకటించడంతో హర్షాధానాలు వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా మొదట కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వర్గీయ చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి పేరు ప్రకటించారు. వైయస్‌ జగన్‌ ప్రకటన పట్ల వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top