వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలకు హ్యాట్సాఫ్‌


నెల్లూరు: ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్దితో రాజీనామా చేసి, వాటిని ఆమోదించుకున్న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలకు హ్యాట్యాఫ్‌ చెబుతున్నామని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైయస్‌ఆర్‌సీపీకి ఉప ఎన్నికలు కొత్త కాదని స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.
 
Back to Top