వైయస్‌ఆర్‌ హమారా..వైయస్‌ జగన్‌ హమారా


విశాఖ: నారా హమారా..టీడీపీ హమారా కాదని, వైయస్‌ఆర్‌ హమారా..వైయస్‌ జగన్‌ హమారా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ  సమ్మేళనంలో అంజాద్‌బాషా మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా ఏ ప్రభుత్వం మైనారిటీలను ఆదుకోలేదని, ఒక్క వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ వ్యక్తిత్వం ఎలాంటిందంటే..ఒక్క మాట ఇస్తే ఎదురించే వ్యక్తిత్వమన్నారు. చంద్రబాబు వ్యక్తిత్వం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఏకైక వ్యక్తి అన్నారు. వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వం ఒకసారి గమనించాలన్నారు. తన సొంత మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డిని కమలాపురానికి పంపించి తనను కడప ఎమ్మెల్యేను చేసిన వ్యక్తిత్వం వైయస్‌ జగన్‌ది అన్నారు. చంద్రబాబు తన సొంత బావమరిదిని పక్కన పెట్టారని విమర్శించారు. 1999వ సంవత్సరంలో బీజేపీతో చంద్రబాబు జత కట్టారన్నారు. 2014లో మోడీ కాళ్లు పట్టుకొని సీఎం అయిన చంద్రబాబు ఇవాళ మళ్లీ మోడీ గాలి తగ్గిందని ముస్లింల ఓట్ల కోసం నాటకాలాడుతున్నారన్నారు. నారా హమారా అంటూ డబ్బులిచ్చి గుంటూరులో సభ పెట్టించుకున్న చంద్రబాబు, మైనారిటీ యువకులను దారుణంగా కొట్టించారన్నారు. జగన్‌ హమారా అని ముస్లింలు నినదిస్తున్నారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో ఐదు ప్రాంతాల్లో ముస్లింల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారని వివరించారు. 


 
Back to Top