<br/><br/>ప్రకాశం: ప‌్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై వైయస్ఆర్‌సీపీ నాయకులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతికి నల్ల రిబ్బన్ దరించి నిరసనలో పాల్గొనగా, ప్రత్యేక హోదా సాధనకు ఈ నెల 5న ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వచ్చిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు నల్లరిబ్బన్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. పార్టీ నాయకులకు వైయస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలంతా నల్లబ్యాడ్జిలతో పాల్గొన్నారు.