విజయనగర్‌ బాధితులకు మేకపాటి పరామర్శ

హైదరాబాద్, 24 అక్టోబర్ 2013:

కుండపోత వర్షాల కారణంగా విజయనగర్ కాలనీలో గోడ కూలిన ఘటనలో బాధితులను వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, హెచ్ఏ రెహ్మాన్ పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని‌ వారు సందర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

విజయనగర్ కాలనీలో‌ బుధవారం రాత్రి గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్‌గా గుర్తించారు. శ్రీహరి అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top