సీఐఐ సదస్సులతో రాష్ట్రానికి ఒరిగిందేంటీ?

వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబు నిర్వహించే సీఐఐ సదస్సులతో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. భాగస్వామ్య సదస్సుల వల్ల రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నాలుగేళ్లుగా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాయచోటిలో ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అన్నట్లుగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై మంత్రులు అవహేళన చేయడం సరికాదన్నారు. 
పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లు ప్రచార ఆర్భాటమే
పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లు కేవలం ప్రచార ఆర్భాటమే ఆంధ్రరాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. నాలుగు సంవత్సరాలుగా రూ. వేల కోట్లు ఖర్చు చేసి పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లు పెడుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top