వైయస్‌ జగన్‌పై హత్యాయత్నానికి నిరసగా ర్యాలీ


– బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి
విజయవాడ: వైయస్‌ జగన్‌పై హత్యాయత్నానికి నిరసనగా విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేద్కర్‌ విగ్రహానికి వైయస్‌ఆర్‌సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నాయకులు విమర్శించారు.  వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీ విచారణలోనే నిజాలు నిగ్గు తేలుతాయని పార్టీ నేతలు అన్నారు. ర్యాలీలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


 

తాజా వీడియోలు

Back to Top